ఆ కారణంతోనే మద్యం ధరలు పెంచాం.. సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఏపీలో మద్యం అమ్మకాలు, ధరల పెంపుపై విమర్శలు వస్తున్న వేళ ఏపీ ముఖ్యమంత్రి జగన్ స్పందించారు. ధరల పెంపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం.. దశల వారీ మద్యపాన నిషేధానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మద్యపాన నియంత్రణలో భాగంగా మద్యపానాన్ని నిరుత్సాహపరచడానికి లిక్కర్‌ ధరలను భారీగా పెంచినట్లు చెప్పారు. మద్యపానాన్ని నిరుత్సాహపరచడానికి 75 శాతం పెంచాలి.. ఏపీలో 25 శాతం పెంచి తగ్గించాలనుకుంటే.. ఢిల్లీలో 70 శాతం పెంచారని గుర్తు చేశారు. అందుకే 75 శాతం పెంచి.. గట్టి చర్య తీసుకున్నామన్నారు.